భారతదేశం, జూన్ 14 -- జెఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ భారతదేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని సెలబ్రేట్​ చేసుకునేందుకు వాహన తయారీదారు జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్​యూవీకి చెందిన అన్ని వేరియంట్లపై భారీగా ప్రైజ్​ కట్​ని ప్రకటించింది. 2025 ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధర ఇప్పుడు రూ .4.44 లక్షల వరకు తగ్గింది. ప్రైజ్​ కట్​ అనంతరం జెడ్ఎస్ ఈవీ ధరలు ఇప్పుడు రూ. 16.75 లక్షల నుంచి ప్రారంభమై రూ .20.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ ధర తగ్గింపు టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ 6, ఎంజీ విండ్సర్ ప్రో (ఫిక్స్​డ్​ బ్యాటరీ ఆప్షన్​) ను కూడా వెనక్కి నెట్టి జెడ్ఎస్ ఈవిని మరింత చౌకగా చేస్తుంది!

ధరల తగ్గింపు గురించి జెఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ హెడ్ రాకేష్ సేన్ మాట్లాడుతూ.. "గత ఆరేళ్లుగా డైనమిక్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్​...