భారతదేశం, జనవరి 31 -- తిరువనంతపురంలోని క్రికెట్ స్టేడియంలో ఈ రోజు తుపాను వచ్చింది. అది అలాంటి ఇలాంటి తుపాను కాదు. పరుగుల తుపాను.. ప్రత్యర్థిని ముంచేసే బౌండరీల తుపాను.. రికార్డులు బ్రేక్ చేసే తుపాను. ఆ తుపాను పేరే ఇషాన్ కిషన్. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్ శనివారం (జనవరి 31) న్యూజిలాండ్ తో అయిదో టీ20లో సెంచరీ బాదేశాడు.
టీమిండియా డైనమైట్ ఇషాన్ కిషన్ మరోసారి పేలాడు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. శనివారం తిరువనంతపురంలో జరుగుతున్న అయిదో టీ20లో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఇషాన్ కిషన్. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తం మీద 43 బాల్స్ లో 103 రన్స్ చేసి ఔటయ్యాడు ఇషాన్. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి.
సుడిగాలి ఇన్నింగ్స్ లో చెలరేగిన ఇషాన్ కిషన్ ఇష్ సోధి వేసిన 12 ఓవర్లో మరింతగా రెచ్చిపోయాడు. ఫస్ట్ బాల్ సోధి వైడ్ వేశా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.