భారతదేశం, అక్టోబర్ 26 -- మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ నుంచి 'జాగృతి జనం బాటా' (పాదయాత్ర)ను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలు. 119 నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగనుంది.

'జనం బాట' కార్యక్రమానికి నిజామాబాద్ బయలుదేరే ముందు గన్ పార్క్ వద్ద కవిత అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. "తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి. పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, ...