భారతదేశం, ఏప్రిల్ 4 -- భారత దేశంలో చాలా మంది తక్కువ జీతంతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి ముఖ్య కారణం.. సరైన ఆర్థిక అవగాహన లేకపోవడం! వాస్తవానికి మనం ఎంత సంపాదిస్తున్నామని కాదు, వచ్చే జీతాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది చాలా ముఖ్యం. అధిక వేతనం వచ్చినా అప్పుల పాలైన వారు ఉన్నారు, తక్కువ జీతాన్ని సరిగ్గా 'బడ్జెట్​' వేసుకుని కోట్ల సంపదను సృష్టించుకున్న వారూ ఉన్నారు. అందుకే ఇప్పుడు.. రూ. 30వేల నెలవారీ జీతాన్ని ఎలా బడ్జెట్​ వేసుకోవాలి? ఎలా ఇన్వెస్ట్​ చేస్తే మన భవిష్యత్తు సెక్యూర్డ్​గా ఉంటుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జీతాన్ని బడ్జెట్​ చేసుకునేందుకు పర్సనల్​ ఫైనాన్స్​ ప్రపంచంలో ఒక చక్కటి ఫార్ములా ఉంది. అదే.. "50-30-20". తక్కువ జీతం పొందుతున్న వారికి ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఫార్ములాలో భాగంగా..

50 పర్సెంట్​- మీ అవసరాలకు ఖర్చు చేయాలి. అంటే.....