భారతదేశం, అక్టోబర్ 27 -- స్టార్ మా సీరియల్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. సీనియర్ నటీనటులు ప్రభాకర్, ఆమని లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా మొదటి నుంచీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ సీరియల్ 300 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది.

ఆమని, ప్రభాకర్ నటిస్తున్న స్టార్ మా సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ 12న ఈ సీరియల్ ప్రారంభం కాగా.. తాజాగా సోమవారం (అక్టోబర్ 27)తో ఈ మైలురాయిని అందుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "కలిసి నవ్వుతూ, ఏడుస్తూ, ఎదుగుతున్న ఓ కుటుంబానికి 300 ఎపిసోడ్లు. మీ ప్రేమ, మద్దతు ప్రతి క్షణాన్ని మధుర జ్ఞాపకం చేసింది.

మరెన్నో జ్ఞాపకాల కోసం సిద్ధమవుతూ.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సోమవారం నుంచి...