భారతదేశం, ఆగస్టు 7 -- ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్​) దాఖలు చేసిన తర్వాత ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ రిటర్న్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే.. మీ ఐటీఆర్ "చెల్లనిది" లేదా "అసంపూర్ణం"గా పరిగణిస్తారు. దీంతో మీకు రావాల్సిన రిఫండ్ ఆలస్యం అవుతుంది.

సురక్షితంగా, సులభంగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, లేదా ఇప్పటికే ధృవీకరించిన బ్యాంక్ అకౌంట్/డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ఉపయోగించవచ్చని ఐటీ శాఖ తెలిపింది.

ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ (incometax.gov.in) ను సందర్శించండి.

హోమ్ పేజీలో కనిపించే 'e-Verify Return' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

అక్కడ మీ పాన...