భారతదేశం, మే 27 -- నైరుతు రుతుపవనాల నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​, ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్​ అలర్ట్​ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఇక కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్​లో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

"ఉరుములు, మెరుపులుస ఈదురుగాలులతో కూడిన తేలికపాటి / మోస్తరు వర్షాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. మే 27న కేరళ- మాహేలో చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మే 28-జూన్ 01 మధ్య భారీ వర్షాలు పడతాయి," అని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్​లో పేర్కొంది.

మే 26వ ఐఎండీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. మే 27న కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాట...