భారతదేశం, మే 8 -- మే 7, బుధవారం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులను చేసిన నేపథ్యంలో, భారత్ లో 430 విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను మే 10, శనివారం వరకు మూసివేశారు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, అకాసా ఎయిర్, పలు విదేశీ విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

భారత విమానయాన సంస్థలు గురువారం మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి. మరోవైపు, చాలా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేసి, బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాలను 'రీ రూట్' చేయడానికి ఎంచుకున్నాయి.

శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్ సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్ కోట్, భుంతర్, సిమ్లా, గగ...