భారతదేశం, జూన్ 17 -- 2025 గ్రాండ్ విటారా ఎస్​-సీఎన్జీ మోడల్‌ని భారత మార్కెట్​లో లాంచ్​ చేసింది మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్. ఇందులోని డెల్టా సీఎన్జీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక జెటా సీఎన్జీ ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.62 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్ అప్‌డేట్ చేసిన ఫీచర్లు, భద్రతా పరికరాలతో వస్తుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

2025 మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​- సీఎన్జీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈపీఎస్​), ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్​), ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఇప్పుడు స్టాండర్డ్‌గా అందుబాటులోకి వచ్చాయి.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, 2025 గ్రాండ్ విటారా సీఎన్జీలో పీఎం 2.5 డిస్‌ప్లేతో ఆటో ప్యూరిఫైర్, క్లారియన...