భారతదేశం, ఫిబ్రవరి 23 -- భారతదేశ వాతావరణంపై మరోసారి 'ఎల్‌నినో' నీడలు కమ్ముకుంటున్నాయి. 2026 ద్వితీయార్థంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం బలంగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో భారత్‌లో వర్షపాతం తగ్గడం, వేసవి కాలం అత్యంత కఠినంగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా విడుదలైన వాతావరణ నమూనాలు (Weather Models) ఈ ఆందోళనను నిజం చేస్తున్నాయి.

అమెరికాకు చెందిన 'నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్' (NOAA) తాజా నివేదిక ప్రకారం.. 2026 ఆగస్టు-అక్టోబర్, సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలో ఎల్‌నినో సంభవించే అవకాశం 60 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఈ అంచనా కేవలం 50 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 60 శాతానికి పెరగడం గమనార్హం. అంటే, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరింత వేగంగా మారబోతున్నాయి.

ప్రస్తుతం పసి...