భారతదేశం, ఫిబ్రవరి 11 -- సబ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్​లో ఇటీవల అనేక కొత్త కార్లు లాంచ్ అవ్వడంతో మళ్లీ ఉత్సాహం పెరిగింది. 2024 మారుతీ సుజుకీ డిజైర్ (నవంబర్ 2024లో లాంచ్) తో ప్రారంభమై, 2024 హోండా అమేజ్ (డిసెంబర్ 2024లో లాంచ్) కూడా వచ్చింది. అదే సమయంలో టాటా టిగోర్ కూడా జనవరి 2025లో అప్‌డేట్ అయ్యింది. ఆసక్తికరంగా, డిజైర్- అమేజ్ పూర్తిగా కొత్త తరం మోడళ్లు అయితే, టిగోర్ ఫీచర్స్ లిస్ట్, వేరియంట్లలో అప్‌డేట్స్‌తో ఫేస్‌లిఫ్ట్ పొందింది. కాగా ఇప్పుడు 2025 టిగోర్​లో కొత్త టాప్​ ఎండ్​ మోడల్​ని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు టిగోర్​ ఎక్స్​జెడ్​ ప్లస్​ లక్స్​. ఈ వేరియంట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 టాటా టిగోర్ టాప్ వేరియంట్ 15-ఇంచ్​ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయ...