భారతదేశం, అక్టోబర్ 12 -- 2025 బొలెరోని ఇటీవలే సంస్థ లాంచ్​ చేసింది. అంతేకాదు, బొలెరో శ్రేణిలో కీలకమైన మార్పులు చేస్తూ, కొత్తగా టాప్-స్పెక్ బీ8 ట్రిమ్‌ను సైతం విడుదల చేసింది. దీంతో ఇప్పుడు బొలెరో మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కారు వేరియంట్లు, వాటి ఫీచర్స్, ధరలు వంటి​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 మహీంద్రా బొలెరో కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ, అన్ని వెర్షన్లలో తప్పనిసరి భద్రతా ఫీచర్లను మహీంద్రా జోడించింది. వాటిలో:

ఇవే కాకుండా, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి మహీంద్రా మైక్రో-హైబ్రిడ్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ కూడా అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభిస్తాయి.

1. మహీంద్రా బొలెరో: బీ4 వేరియంట్ (ధర: రూ. 7.99 లక్షలు)

డిజైన్: సాధారణ నలుపు రంగు గ్రిల్, క్యాప్‌లు లేని స్టీల్ వీల్స...