భారతదేశం, సెప్టెంబర్ 30 -- చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లైన ఒప్పో, వివోలు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను లాంచ్​ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అవి.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్, వివో ఎక్స్300 సిరీస్. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్‌లకు సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై కంపెనీలు చైనా మార్కెట్‌లో ఇప్పటికే టీజర్లను విడుదల చేయడం మొదలుపెట్టాయి. అలాగే అనేక లీక్‌లు కూడా వెలువడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్‌లు విడుదల కావడానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, కొత్త తరం ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో ఈ రెండు బ్రాండ్‌లు ఏం అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.

ఈ నేపథ్యంలో, మేము వివో ఎక్స్300 ప్రో 5జీ, ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో 5జీ మధ్య ఉన్న ముఖ్యమైన స్పెసిఫికేషన్ల పోలికను అందిస్తున్నాము..

డిజైన్:

వివో ఎక్స్​300 ప్రో 5జీ మోడల్ డిజైన్‌ను వివో ఇట...