Hyderabad, జూన్ 13 -- తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ ఏస్ (Ace). ఈ సినిమా గత నెల 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం. శుక్రవారం (జూన్ 13) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఏస్. ఐఎండీబీలో 8.5 రేటింగ్ సాధించి ప్రేక్షకుల మెప్పు పొందినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

రెండేళ్ల కిందటే మూవీ అనౌన్స్ చేసి గత నెల 23న థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఆశ్చర్యకంగా ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.

విజయ్ సేతుపతి,...