Hyderabad, జూలై 19 -- తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్ (Show Time) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇదే నెలలో డిజిటల్ ప్రీమియర్ కూ సిద్ధమవుతుండటం విశేషం. నవీన్ చంద్ర, రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్ జులై 4న థియేటర్లలో రిలీజైంది. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఓ డిఫరెంట్ స్టోరీతో వచ్చినా స్క్రీన్‌ప్లే దెబ్బ తీసిందంటూ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ వచ్చే శుక్రవారం (జులై 25) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ శనివారం (జులై 19) వెల్లడించింది. "ప్రశాంతంగా ఉండే ఓ ఇల్లు ఓ డెడ్లీ మిస్టరీకి కేంద్రంగా మారితే.. షో టైమ్ జులై 25 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్ష...