భారతదేశం, మే 5 -- గత వారం ఇండియాలో లాంచ్​ అయిన సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రోపై బిగ్​ అప్డేట్​. దేశంలో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సేల్ తాజాగా మొదలైంది. ఫ్లిప్​కార్ట్, ఫ్లిప్​కార్ట్​ మినిట్స్, క్రోమా, విజయ్ సేల్స్ సహా ప్రధాన రిటైల్ ఔట్​లెట్స్​లో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి లభిస్తుంది. స్పెషల్ లాంచ్ డే ఆఫర్​లో భాగంగా బేస్ వేరియంట్​ని రూ.16,999 (ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి) ధరకే పొందొచ్చు! ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సీఎంఎఫ్​ ఫోన్ 2 ప్రో 2025 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా లాంచ్​ అయ్యింది. డిజైన్, పనితీరు, కెమెరా సిస్టెమ్, సాఫ్ట్​వేర్​ పరంగా సీఎంఎఫ్​ ఫోన్ 1 కంటే అనేక అప్​గ్రేడ్స్​ ఈ స్మార్ట్​ఫోన్​లో ఉన్నాయి.

ఇక సీఎంఎఫ్​ ఫోన్ 2 ప్రో బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. వీట...