భారతదేశం, ఆగస్టు 24 -- మహీంద్రా బీఈ 6 బ్యాట్​మాన్ ఎడిషన్​కి క్రేజీ డిమాండ్​ కనిపించింది! ఆగస్ట్​ 14న ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సంస్థ లాంచ్​ చేయగా, తొలుత 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పింది. అయితే, వినియోగదారుల నుంచి కనిపించిన ఆసక్తితో 999 యూనిట్లను ఉత్పత్తి చేస్తామని చెప్పింది. అయితే, ​మహీంద్రా తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 135 సెకన్లలోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీకి చెందిన మొత్తం యూనిట్లు అమ్ముడైపోయాయి!

ఈ ప్రత్యేకమైన మహీంద్రా బీఈ 6 'బ్యాట్‌మాన్ ఎడిషన్' ఎలక్ట్రిక్ కారును 'ప్యాక్ త్రీ' వేరియంట్‌ ఆధారంగా సంస్థ రూపొందించింది. ఇందులో 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 682 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్​ మోటార్ గరిష్టంగా 286 హెచ్‌పీ పవర్​ని, 380 ఎన్​ఎమ్​ ...