భారతదేశం, జూన్ 24 -- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్​ఎస్​ఎల్​) పరీక్ష 2025 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్సీ).. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 18 లోపు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా SSC CHSL 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 18003093063

ఈ సంవత్సరం ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ ద్వారా సుమారు 3,131 ఖాళీల భర్తీ జరగనుంది. ఖాళీల తుది సంఖ్య త్వరలో వెల్లడి కానుంది. పోస్ట్, కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను ఎస్​ఎస్సీ తన వెబ్‌సైట్ ssc.gov.inలో త్వరలో తెలియజేస్తుంది. రాష్ట్రాల వారీగా, జోన్ల వారీగా ఖాళీల వివరాలు తమ వద్ద ఉండవని, ఈ సమాచారం కోసం సంబంధిత యూజర్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలని కమిషన...