Hyderabad, జూలై 7 -- స్టార్ మా ఛానెల్ సీరియల్స్ అంటే తెలుగులో టాప్. టీఆర్పీ రేటింగ్స్ విషయంలో కొన్నేళ్లుగా ఈ ఛానెల్లో వచ్చే సీరియల్స్ కు తిరుగే లేదు. ఇప్పుడా ఛానెల్లో వచ్చే మల్లి నిండు జాబిలి సీరియల్ ఏకంగా 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

మల్లి సీరియల్ 1000 ఎపిసోడ్ల మైల్ స్టోన్ అందుకున్నట్లు స్టార్ మా ఛానెల్ సోమవారం (జులై 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇది తమకో ఎమోషనల్ జర్నీ అని చెప్పింది. "1 నుంచి 1000 ఎపిసోడ్ల వరకు.. ప్రతి క్షణం మాకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిదే. ఇది కేవలం షో కాదు.. ఓ ఫీలింగ్.

అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ 1000 ఎపిసోడ్లను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మల్లి సీరియల్ సోమవారం నుచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు కేవలం మీ స...