భారతదేశం, జూన్ 12 -- 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే గుజరాత్ లోని మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ప్రత్యక్ష సాక్షి ఒకరు పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. మొదట పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తరువాత అక్కడ మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిపాడు.

భారీ శబ్ధం వినిపించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నానని, మొదట అది భూకంపంలా అనిపించిందని స్థానిక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. "మేము బయటకు వచ్చేసరికి గాలిలో దట్టమైన పొగ కనిపించింది. ఇది విమాన ప్రమాదం అని అప్పటికి తమకు తెలియలేదని చెప్పారు. "మేము ప్రమాద స్థలానికి వచ్చినప్పుడు, చాలా మృతదేహాలు చెల్లా చెదురుగా పడి కనిపించాయి'' అని చెప్పాడు. ఆ తరువాత సహాయ సిబ్బంది వాటిని ఆసుపత్రులకు తరలి...