భారతదేశం, ఏప్రిల్ 16 -- ఇండియాలో టెస్లా ఎంట్రీపై బిగ్​ అప్డేట్​! గత నెలలో రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ని ప్రారంభించిన ఈ దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ.. ఇప్పుడు భారత రోడ్లపై తన పోర్ట్​ఫోలియోలోని ఒక ఈవీని పరీక్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్​గా మారింది. వీడియోలో కనిపిస్తున్నది 2025 టెస్లా మోడల్​ వై. ముంబై- పుణె ఎక్స్​ప్రెస్​ వేపై ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ​ కనిపించింది.

ఎలాన్​ మస్క్​కి చెందిన టెస్లా తన మొదటి డీలర్​షిప్​ షోరూమ్​ని ముంబైలో ప్రారంభిస్తుందని, తొలుత భారతదేశంలో పూర్తిగా దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మొదలుపెడుతుందని కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. ఈ బ్రాండ్ మొదట మోడల్ వైని భారత మార్కెట్​లో విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇదొక ఎస్​యూవీ కావడం, ఈ బాడీ స్టైల్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప...