భారతదేశం, డిసెంబర్ 31 -- రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోంది. అయితే ఈసారి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. యూరియా కొనుగోలును సులభతరం చేయుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.

గతంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ పంపిణీ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధికార యంత్రాగానికి కూడా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.

ఇక యూరియా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 18005995779 నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించింది. ఇక జిల్లాల వారీగా కూడా వేర్వ...