భారతదేశం, జూన్ 16 -- ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇరాన్​లో చదువు కోసం వెళ్లిన భారత విద్యార్థులు.. తాజా పరిణామాల మధ్య నరకం చూస్తున్నారు. ఎటువైపు నుంచి ఏ మిసైల్​ దూసుకొస్తుందో అన్న భయం మధ్య తమను దేశం నుంచి తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

జూన్ 12న ఇజ్రాయెల్ బాలిస్టిక్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి "మూడు రోజులుగా నిద్రపోలేదని" ఇరాన్‌లో ఉన్న వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థుల్లో ఒకరు తెలిపారు.

ఇంతిసాల్ మొహిదీన్ అనే భారత విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ, "శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పెద్ద శబ్దాలకు నిద్రలేచాను. వెంటనే బేస్‌మెంట్‌కు పరుగుతీశాను. అప్పటి నుంచి ఎవరూ నిద్రపోలేదు," అని చెప్పాడు.

విద్యార్థుల హాస్టళ్లు, అపార్ట్‌మెంట్‌లకు కేవలం కొన్న...