భారతదేశం, జూలై 25 -- గూగుల్​ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్‌గా అవతరించారు! 2023 నుంచి ఈ టెక్ దిగ్గజం మార్కెట్ విలువలో $1 ట్రిలియన్ కంటే ఎక్కువ జోడించి, పెట్టుబడిదారులకు 120శాతం రాబడిని అందించిన నేపథ్యంలో ఇది జరిగింది. అల్ఫాబెట్ షేర్లు రికార్డు స్థాయి గరిష్టంగా ముగియడంతో, 53 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన సీఈఓ నికర విలువ 1.1 బిలియన్​ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

గురువారం అమెరికా స్టాక్​ మార్కెట్​లో ఆల్ఫాబెట్​ షేర్లు 4.1శాతం పెరిగాయి. రెండో త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు కనబరచడం ఇందుకు కారణం. అంతేకాదు, 2025 క్యాపిటల్​ ఎక్స్​పెండీచర్​ అంచనాలను కూడా సంస్థ పెంచింది. ఫలితంగా స్టాక్​తో పాటు పిచాయ్​ నెట్​ వర్త్​ కూడా భారీ పెరిగింది. ఆయన సంపద బిలియన్​ మార్క్​ని తాకింది.

వ్యవస్థాపకులు కాన...