భారతదేశం, ఏప్రిల్ 6 -- కొన్నేళ్ల క్రితం రష్యాలో సంచలనం సృష్టించిన 'చెస్​బోర్డ్​ కిల్లర్​' కేసులో తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. 48 హత్యలు చేయడంతో సీరియల్​ కిల్లర్​ అలెగ్జాండర్​ పిచుస్కిన్​కి యావజ్జీవ కారాగార శిక్ష పడగా, మరో 11 మందిని కూడా తానే చంపినట్టు అతను తాజాగా ఒప్పుకున్నాడు! మొత్తం మీద 63మందిని చంపినట్టు చెప్పాడు.

1992 నుంచి 2006 మధ్యలో జరిగిన హత్యల నేపథ్యంలో అలెగ్జాండర్​ పిచుస్కిన్ రష్యాలోని మారుమూల ఆర్కిటిక్ ఉత్తర ప్రాంతంలోని పోలార్ ఔల్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు శిక్ష పడటానికి దారితీసిన 48 హత్యల కంటే ఎక్కువ మందిని చంపినట్లు అధికారులు అనుమానించడంతో, మరో 11 హత్యలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అలెగ్జాండర్​ పిచుష్కిన్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం.

దక్షిణ మాస్కోలోని బిట్సెవ్​స్కీ పార్క్ చుట్టూ 14...