భారతదేశం, ఏప్రిల్ 23 -- పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. ఈ టీఆర్ఎఫ్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా 2019 లో ఏర్పడింది. గత మూడు నాలుగేళ్లుగా జమ్మూకశ్మీర్ లో వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లు తదితరులతో సహా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్తోంది.

2021 జూన్ లో జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) స్టేషన్ లో జరిగిన జంట డ్రోన్ దాడులకు పాల్పడింది ఈ టీఆర్ఎఫ్ సంస్థనే. పాకిస్తాన్ నుంచి సరిహద్దు వెంబడి డ్రోన్ ల ద్వారా ఆయుధాలను, పేలుడు పదార్థాలను భారత భూభాగంలోకి పంపించిన అనేక సంఘటనల వెనుక కూడా టిఆర్ఎఫ్ ఉంది.

కానీ భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పలు విశ్లేషణల ప్రకారం.. టిఆర్ఎఫ్ అనేది ప్రధాన లష్కరే తోయిబా గ్రూప్ కు ఉన్న మరో పేరు తప్ప మరేమీ కాదు. మరో మాటలో...