భారతదేశం, ఏప్రిల్ 22 -- అంతర్జాతీయంగా భారీ డిమాండ్​ ఉన్న రంగాలుగా ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ), డేటా సైన్స్​ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి టెక్​ ప్రపంచంలో ఈ రెండింటిపై అందరి ఫోకస్​ పడింది. అందుకు తగ్గట్టుగానే వీటిల్లో మంచి కెరీర్​ అవకాశాలు కూడా ఉంటున్నాయి. మరి మీరు కూడా ఏఐ, డేటా సైన్స్​లో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఆయా రంగాల్లో టాప్​ 7 భారతీయ ఇన్​స్టిట్యూషన్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మనుషుల జీవితంలో ఏఐ ఇప్పుడు ఒక భాగమైపోతోంది. మనుషుల్లా పనిచేసేందుకు ఏఐ ఆధారిత మెషిన్లు పుట్టుకొస్తున్నాయి. ఈ రంగానికి డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక భారీ డేటా వాల్యూంని సైంటిఫిక్​ పద్ధతులు, ప్రాసెస్​, ఆల్గోరిథంతో ఎనలైజ్​ చేసి జ్ఞానాన్ని ఇవ్వడమే డేటా సైన్స్​. టెక్నాల...