భారతదేశం, మే 27 -- ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) ప్రపంచం రోజుకో విధంగా అభివృద్ధి చెబుతోంది. ఏఐ మోడల్స్​ రోజురోజుకు పవర్​ఫుల్​ అవుతూనే ఉంటున్నాయి. మనుషులు గంటలు, రోజుల పాటు చేసే పనులను ఏఐ ఇప్పుడు నిమిషాల్లో లేదా క్షణాల్లో చేసేస్తోంది. యూట్యూబ్​లో వీడియో క్రియేషన్​ నుంచి కోడింగ్​తో పాటు పెద్ద పెద్ద కంపెనీల సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రతిచోట ఇప్పుడు ఏఐని వాడుతున్నారు. వీటన్నింటి మధ్య మనందరిలో ఒక ఆందోళన! ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంటోంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు నిపుణులు అమెరికా డేటాను పరిశీలించారు. ఈ పరిశీలనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా "ఏఐ అన్​ఎంప్లాయిమెంట్​" అనే గూగుల్​ సెర్చ్​ రికార్డు స్థాయిని టచ్​ చేసింది. మరీ ముఖ్యంగా లండన్​, శాన్...