భారతదేశం, జనవరి 31 -- అందం, యాక్టింగ్, డ్యాన్స్ తో తెలుగు ఆడియన్స్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీలీల ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా పరాశక్తి అనే తమిళ మూవీ చేసిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ధనుష్ కొత్త మూవీ (డీ55)లో శ్రీలీల హీరోయిన్ అని మేకర్స్ ఇవాళ (జనవరి 31) అనౌన్స్ చేశారు.

రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ఇంకా టైటిల్ పెట్టలేదు. డీ55 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ఈ విషయాన్ని మేకర్స్ శనివారం ప్రకటించారు.

''మీరు ఊహించి ఉండరు కదా. డీ55 సినిమాలోకి డాజ్లింగ్ శ్రీలీలకు వెల్ కమ్'' అని ప్రొడక్షన్ బ్యానర్ వండర్ బార్ ఫిల్మ్స్ ప్రకటించింది. డీ55...