భారతదేశం, జూలై 12 -- అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ (విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో) తన ప్రాథమిక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఇంజిన్ పనిచేయని తరుణంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లలో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన కీలక సంభాషణ రికార్డ్ అయింది.

15 పేజీల ఈ నివేదిక ప్రకారం.. "ఇంధనం ఎందుకు ఆపేశారు?" అని ఒక పైలట్ అడగ్గా, "నేను చేయలేదు" అని మరొక పైలట్ బదులిచ్చారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని చేరుకున్న వెంటనే, 13:38:42 IST (08:08:42 UTC) వద్ద రెండు ఇంజిన్ ఇంధన కటాఫ్ స్విచ్‌లు 'రన్' నుంచి 'కటాఫ్' స్థానానికి మారాయి. ఆ వెంటనే ఈ సంభాషణ జరిగింది.

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, లండన్ గాట్విక్‌కు వెళ్లేందుకు బయలుదేరిన ఏఐ 171 విమానం, బీజే మెడికల్ కా...