భారతదేశం, జూన్ 23 -- భారత మార్కెట్​లో చిన్న కార్ల తయారీకి రారాజుగా పేరుగాంచిన మారుతీ సుజుకీ.. బ్రెజా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ రెండు మోడళ్ల సక్సెస్​తో పాటు యుటిలిటీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మారుతీ సుజుకీ ఇప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈసారి 'ఎస్కుడో' (Escudo) పేరుతో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది.

మారుతీ సుజుకీ ఇప్పటికే భారతదేశంలో 'ఎస్కుడో' 'టార్క్నాడో' అనే పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. ఆసక్తికరంగా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకీ విటారాకు 'ఎస్కుడో' అనే పేరును ఉపయోగిస్తున్నారు. ఇక రాబోయే ఎస్​యూవీ భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారవుతుందని, ఇది బ్రెజా- గ్రాండ్ విటారా మధ్య...