భారతదేశం, జూన్ 18 -- వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ ప్లాజాల వద్ద అధిక చెల్లింపులను ఇక తగ్గించుకోవచ్చు. అందుకోసం కేంద్రం ఒక యాన్యువల్ పాస్ ను తీసుకువస్తోంది. రూ. 3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే, యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది.

ప్రైవేట్ వాహనాలకు రూ. 3 వేల ధరతో ఒక ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుందని, వీటిలో ఏది మొదటిదైతే అది చెల్లుబాటు అవుతుందని గడ్కరీ ఎక్స్ లో ఒక పోస్ట్ లో తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేటు వాహనాల కోసం ప్రత్యేకంగా ఈ పాస్ ను రూపొందించారు. ఇది వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కా...