భారతదేశం, జనవరి 31 -- హైదరాబాద్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ హరితహారం కాలనీలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ మధ్య రైలు కిందపడి చనిపోయారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. విజయ(35), విశాల్‌(17), చేతన(18)ను మృతులుగా గుర్తించారు. మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....