భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఈనెలలో అరుణాచలం వెళ్లే ప్లాన్ ఉందా.? అయితే మీకోసం బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ.5 రోజులు ఉంటుంది. కాచీపురం, అరుణాచలంతో పాటు మరికొన్ని ప్రాంతాలను చూడొచ్చు.

హైదరాబాద్ నుంచి అరుణాచలం ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఫిబ్రవరి 20, 2026వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మారితే. మరో తేదీలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించాలి.

టూర్ ప్యాకేజీలోని వివరాల ప్రకారం.. టికెట్లు బుకింగ్ చేసుకున్నవాళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. సాయంత్రం 5 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ 17653) ఉంటుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు. ఇక రెండో రోజు అంటే పుదిచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేర...