భారతదేశం, జనవరి 31 -- శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానక్ రామ్ గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో సీవరేజ్ సిస్టమ్ ను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంక్ మెయిన్లను అభివృద్ధి చేయడానికి మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గచ్చిబౌలి, నానక్ రాం గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎండీ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఉత్పన్నం అవుతున్న మురుగు, ఇప్పటివరకు ఉన్న సీవరేజ్ లైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను బట్టి సీవరేజ్ లైన్లను, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ ప్లాన్ లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న నాలాలు...