భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రతి సోమ‌వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిరాటంకంగా కొన‌సాగిస్తున్న హైడ్రా ఇప్పుడు మ‌రో కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టింది. ప్రతి శ‌నివారం ఫోన్‌-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించాల‌ని హైడ్రా నిర్ణయించింది. ఈ శ‌నివారం నుంచే ప్రారంభించాల‌ని హైడ్రా బుధ‌వారం ఒక ప్రక‌ట‌న‌లో తెలిపింది. సెల‌వు రోజులు మిన‌హా.. ప్రతి శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

ఔట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలో ఉన్న న‌గ‌ర ప్రజ‌లు 040-29565750, 040-29565759 ఈ రెండు ఫోను నంబ‌ర్లకు ఫోను చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని తెలిపింది. చెరువులు, పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ ఆక్రమ‌ణ‌లు, చెరువుల్లో మ‌ట్టి పోయ‌డం వంటి అంశాల‌పై ఫిర్యాదు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపార...