భారతదేశం, మే 28 -- ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ (ఏఐ) భయపెడుతున్న వేళ మరో ఆందోళనకర​ వార్త! ప్రముఖ టెక్​ కంపెనీ ఐబీఎం సుమారు 8వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. వీరిలో చాలా వరకు హెచ్​ఆర్​ (హ్యుమన్​ రిసోర్స్​) డిపార్ట్​మెంట్​ వారు ఉన్నారు. తమ రోజువారీ కార్యకలాపాల్లో, మరీ ముఖ్యంగా బ్యాక్​- ఆఫీస్​ ఫంక్షన్స్​లో ఏఐని భాగం చేసేందుకు సంస్థ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తాజా లేఆఫ్స్​ జరిగడం గమనార్హం.

పలు నివేదికల ప్రకారం.. ఈ నెల తొలినాళ్లల్లో 200కుపైగా హెచ్​ఆర్​ రోల్స్​ని ఏఐ ఏజెంట్స్​తో ఐబీఎం భర్తీ చేసింది. ఈ ఏఐ ఏజెంట్స్​ ఉద్యోగుల సమస్యలు, పేపర్​వర్క్​, హెచ్​ఆర్​ డేటా ఆర్గనైజేషన్​ వంటి అడ్మినిస్ట్రేటివ్​ పనులు చేస్తున్నాయి. ఈ తరహా ఏజెంట్స్​పై మానవ పర్యవేక్షణ కూడా పెద్దగా అవసరం లేదు. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సం...