భారతదేశం, అక్టోబర్ 29 -- మహేష్ బాబు మేనకోడలు జాన్వీ తెలుసా? టాలీవుడ్ లో నటిగానూ పేరుగాంచిన మహేష్ అక్క మంజుల కూతురు ఈమె. కొన్నాళ్ల కిందట ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడామె సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతోంది. ఈ విషయాన్ని మంజులే వెల్లడించిండి.

టాలీవుడ్ లోకి మరో నట వారసురాలు వస్తోంది. అది కూడా ఘట్టమనేని వంశం నుంచి కావడం విశేషం. దివంగత సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేన కోడలు, నటి మంజుల కూతురు అయిన జాన్వీ స్వరూప్ తెరంగేట్రం ఖాయమైంది. బుధవారం (అక్టోబర్ 29) ఆమె బర్త్ డే సందర్భంగా మంజుల చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

"నా ముద్దుల కూతురు జాన్వీ స్వరూప్.. బాగా పెద్దదైంది.. తనదైన జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.. ఆమె తనతోపాటు ఓ ప్రకాశవంతమైన వారసత్వాన్ని వెంట తీసుకొస్తోంది.. ఇప్పుడిక వెలగడం ఆమె వంత...