Hyderabad, ఏప్రిల్ 29 -- హిట్ ఫ్రాంఛైజీ.. పేరుకు తగినట్లే మంచి హిట్ అయింది. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ అంటూ ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలి మూవీలో విశ్వక్సేన్, రెండో సినిమాలో అడవి శేష్ నటించగా.. ఇప్పుడు మూడో సినిమాలో నాని లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఒక్కో భాగంలో ఒక్కో కేసు, దానిని ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడన్న కథలతో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.

హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన తొలి సినిమా హిట్: ద ఫస్ట్ కేస్. 2020లో ఈ మూవీ రిలీజైంది. ఇందులో విక్రమ్ రుద్రరాజు అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్సేన్ నటించాడు. తెలంగాణ సీఐడీలోని హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)లో సభ్యుడిగా కనిపించాడు. రుహానీ శర్మ ఫిమేల్ లీడ్ గా కనిపించింది. తన గతంలో జరిగిన ఓ ఘటనతోనే సతమతమవుతున్న ఆ పోలీస్ అధికారి.. హైదరాబాద్ లోని ఔటర్ రింగు రోడ్డుపై కనిపించకుండా...