భారతదేశం, ఏప్రిల్ 30 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్ 3' చిత్రం మరొక్క రోజులో మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్లో వైలెంట్ యాక్షన్‍తో నాని రెచ్చిపోయారు. దీంతో హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రానికి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్‍లో జరుగుతున్నాయి. ఈ తరుణంలో హిట్ 3 తొలి రోజు ఎంత కలెక్షన్లు రాబడుతుందో అంచనాలు వెలువడుతున్నాయి.

హిట్ 3 మూవీకి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దూకుడుగా జరుగుతున్నాయి. బుకింగ్స్ ఓపెనైన చోట్లు జోరుగా ఫిల్ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో బుకింగ్స్ అంచనాలకు మించి జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‍లోనూ మంచి కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ప్రమోషన్లు ...