Hyderabad, జూలై 1 -- మలయాళం సినిమా రేంజ్ ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. కమర్షియల్‌గానూ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ ఏడాది అలా మోహన్‌లాల్ నటించినవే రెండు మూవీస్ ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. జూన్ 30తో ఈ ఏడాది తొలి ఆరు నెలలు ముగిసింది. ఈ ఆరు నెలల్లో మలయాళం నుంచి వచ్చిన టాప్ 6 మూవీస్ ఏవో చూడండి.

మోహన్‌లాల్ తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'తుడరుమ్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ రూ.28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.232 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.

కేరళలో రూ.118 కోట్లకు పైగా వసూలు చేసి.. ఆ రా...