భారతదేశం, మే 25 -- హరి హర వీరమల్లు సినిమాకు క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పకున్నాక ఈ చిత్రానికి ఎస్ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై డైరెక్టర్ జ్యోతికృష్ణ స్పందించారు.

హరి హర వీరమమల్లు గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ.. ఎక్స్ (ట్విట్టర్)లో నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చాలా మంది ట్రైలర్ ఎప్పుడంటూ అడిగారు. దీనికి జ్యోతికృష్ణ రెస్పాండ్ అయ్యారు. జూన్ తొలి వారంలో హరి హర వీరమల్లు ట్రైలర్ వస్తుందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ కోస నార్త్ఇండియాలో ఓ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.

హరి...