Hyderabad, జూలై 8 -- హరి హర వీరమల్లు.. ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మొత్తానికి ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్ల జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాను ప్రొడ్యూసర్ ఏఎం రత్నం.. ప్రముఖ హాలీవుడ్ మూవీ సిరీస్ ఇండియానా జోన్స్ తో పోల్చడం విశేషం. ఈ మధ్య ఓ ఈవెంట్లో అతడు ఈ మూవీ గురించి మాట్లాడాడు.

"పవన్ గారికి సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ ట్రైలర్ చూస్తే తనకు మెకన్నాస్ గోల్డ్ గుర్తుకు వచ్చిందని అన్నారు. అయితే సెకండాఫ్ వరకూ చూసుకుంటే మాత్రం ప్రేక్షకులకు ఈ సినిమా ఇండియానా జోన్స్ ను గుర్తుకు తెస్తుంది. ఆ హాలీవ...