భారతదేశం, ఫిబ్రవరి 6 -- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మరో టాలీవుడ్ సినిమానే హనీ. వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి వాద్యా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా మలిచారు డైరెక్టర్ కరుణ కుమార్.

'పలాస'తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్ వాస్తవ సంఘటనల ఆధారంగా 'హనీ' సినిమాతో ఓ చీకటి ప్రయాణాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. భయపెట్టే ఆత్మలు కాదు, భయపెట్టే మనుషులే ఈ కథకు కేంద్ర బిందువు అని, మూఢనమ్మకాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయి? అనే ప్రశ్న ఆడియెన్స్‌ను భయపెడుతుందని మేకర్స్ చెబుతూ వచ్చారు.

ప్రమోషనల్ కంటెంట్‌తో భయపెట్టిన హనీ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 6) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? వంటి అంశాలను నేటి హనీ రివ్యూలో తెలుసుకుంద...