భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ రోజుల్లో అభిమానుల అభిమానంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అత్యుత్సాహంతో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ మీద ప్రభావం చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఫలితంగా తీవ్ర గందరగోళం నెలకొంటుంది. వారికి అసౌకర్యమైన ఫీలింగ్ వస్తుంది. ఫ్యాన్స్ కదా అని ఏం అనలేకపోతున్నారు సెలబ్రిటీలు. వారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. వారిని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పుడు నటుడు రామ్ చరణ్ కూడా తన కవలలను, అతని భార్య ఉపాసనను చూడటానికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ హాస్పిటల్ లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఫ్యాన్స్ నుండి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన శుభవార్త తెలుసుకున్న తర్వాత ఉదయం ఆసుపత్రి వెలుపల పెద్ద సంఖ్యలో మెగా ఫ్యాన్స్ గుమిగూడారు.

అయితే అదే సమయంలో...