భారతదేశం, మే 11 -- రాబిన్‍హుడ్ సినిమా థియేట్రికల్ రన్‍లో ప్లాఫ్ అయినా.. ఓటీటీలో సూపర్ ఆరంభం అందుకుంది. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హీస్ట్ యాక్షన్ కామెడీ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, రాబిన్‍హుడ్ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.

రాబిన్‍హుడ్ సినిమా శనివారం మే 10వ తేదీన జీ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రస్తుతానికి తెలుగులో ఒక్కటే ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్‍‍కు వచ్చిన ఒక్క రోజులోనే జీ5 ఓటీటీలో ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు ఎగబాకింది. ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.

థియేట్రికల్ రన్‍లో రాబిన్‍హుడ్ నిరాశపరచటంతో ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందోననే ఆసక్తి ఏర్పడింది. అయిత...