భారతదేశం, ఫిబ్రవరి 18 -- మనం ఎంత సంపాదించామన్నది కాదు.. సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాము అనేది ముఖ్యం! చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నా, 'ఫైనాన్షియల్​ ప్లానింగ్​' సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంటారు. అదే సమయంలో, కొందరు తక్కువ సంపాదిస్తున్నా, సరైన రూల్స్​- ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్స్​ని పాటించి జీవితంలో ఫైనాన్షియల్​ ఫ్రీడంని సంపాదించుకుంటున్నారు. అయితే, ఫైనాన్షియల్​ ప్లానింగ్​ని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకుంటే చాలా మంచిది! మరీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి సేవింగ్స్​తో పాటు ఇన్వెస్ట్​మెంట్స్​ ప్లానింగ్​ ఉంటే.. డబ్బు విషయంలో, ఇతరుల కన్నా చాలా వేగంగా ఫైనాన్షియల్​ ఫ్రీడంని సంపాదించుకోవచ్చు. అలా అని, ఉన్న తక్కువ డబ్బులను కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయి. మరి స్టూడెంట్స్​ ఇన్వెస్ట్​ చేయడానికి ఏ...