భారతదేశం, ఫిబ్రవరి 1 -- 80వ దశకంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జంటల్లో గోవిందా, నీలం కొఠారి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వారి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.

స్వయంగా గోవిందా కూడా ఒకానొక సందర్భంలో తాను నీలం పట్ల ఆకర్షితుడనయ్యానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని గతంలో గోవిందా వెల్లడించారు. అయితే, తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ నీలం కొఠారి పాత జ్ఞాపకాలు, పుకార్లపై స్పందించారు.

ఉషా కాకడే ప్రొడక్షన్స్ పాడ్‌కాస్ట్‌లో గోవిందాతో లవ్ ఎఫైర్ గురించి నీలం కొఠారి మాట్లాడుతూ.. "బాబోయ్! ఈ మాట ఎవరు చెప్పారు? గోవిందా గారు చాలా మంచి వ్యక్తి. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మేమిద్దరం...