Hyderabad, మే 22 -- స్టార్ మా సీరియల్స్ దూకుడు మామూలుగా ఉండటం లేదు. ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ లో సత్తా చాటుతూనే ఉన్నాయి. టాప్ 10లో ఏకంగా 9 సీరియల్స్ ఈ ఛానెల్ కు చెందినవే కావడం విశేషం. తాజాగా 19వ వారానికి చెందిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. కార్తీకదీపం సీరియల్ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది.

కొన్నేళ్లుగా తెలుగు టీవీ సీరియల్స్ విషయంలో స్టార్ మాకు అసలు తిరుగే లేకుండా పోతోంది. వీటి ముందు ఈ ఇతర తెలుగు ఛానెల్ నిలవడం లేదు. కొన్నాళ్లు జీ తెలుగు గట్టి పోటీ ఇచ్చినా.. క్రమంగా ఆ ఛానెల్ సీరియల్స్ టాప్ 10కు దూరమవుతున్నాయి. ప్రస్తుతం టాప్ 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే కావడం విశేషం. 19వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో 12.22 రేటింగ్ తో కార్తీకదీపం సీరియల్ తొలి స్థానంలో కొనసాగుతోంది.

ఇక రెండో స్థానంలోకి మరోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకొచ్చ...