Hyderabad, మే 2 -- తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ప్రతి వారం తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా టాప్ 4లో ఉన్న సీరియల్స్ స్థానాలు మారిపోతూ ఉన్నాయి. తాజాగా 16వ వారం రేటింగ్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ మరోసారి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. కార్తీకదీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

స్టార్ మా సీరియల్స్ 16వ వారం టీఆర్పీ రేటింగ్స్ చూస్తే.. ఈసారి 11.18తో గుండెనిండా గుడిగంటలు సీరియల్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. గతంలో ఒకటి, రెండు వారాలు ఈ స్థానంలో ఉన్న ఈ సీరియల్ పడుతూ లేస్తూ ఇప్పుడు మరోసారి తొలి స్థానానికి వచ్చింది.

ఇక గత వారం టాప్ లో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ వారం మూడో స్థానానికి పడిపోయింది. ఆ సీరియల్ కు 10.82 రేటింగ్ నమోదైంది. కార్తీకదీపం సీరియల్ రెండో స్థానానికి చేరింది. ఆ...